శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : మంగళవారం, 29 మే 2018 (14:48 IST)

తిరుమలలో శ్రీరెడ్డి.. ఏం చేసిందో తెలుసా?(Video)

తెలుగు సినీ పరిశ్రమలో కల్లోలం సృష్టించిన శ్రీరెడ్డి హఠాత్తుగా తిరుమలలో ప్రత్యక్షమైంది. నిన్న సాయంత్రం కాలి నడకన తిరుమలకు చేరుకున్న శ్రీరెడ్డి ఈ రోజు తెల్లవారుజామున సుప్రభాతసేవలో స్వామివారి సేవలో పాల్గ

తెలుగు సినీ పరిశ్రమలో కల్లోలం సృష్టించిన శ్రీరెడ్డి హఠాత్తుగా తిరుమలలో ప్రత్యక్షమైంది. నిన్న సాయంత్రం కాలి నడకన తిరుమలకు చేరుకున్న శ్రీరెడ్డి ఈ రోజు తెల్లవారుజామున సుప్రభాతసేవలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శత్రువుల నుంచి నన్ను కాపాడమని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు శ్రీరెడ్డి. ఢిల్లీలో చేయబోయే నిరసన విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు.
 
తెలంగాణా ప్రభుత్వం ఆడపిల్లలను చిన్నచూపు చూస్తోందని, తెలంగాణా ప్రభుత్వంలోని నాయకులకు మంచి బుద్థి ప్రసాదించాలని కోరుకున్నానని చెప్పారు. అలాగే తెలంగాణా రాష్ట్రంలో మరోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఎపిలో కూడా తను ఒక పార్టీ అధికారంలోకి రావాలని స్వామి వారిని కోరుకున్నానని, అయితే ఆ పార్టీ ఏదో ఇప్పుడే చెప్పనన్నారు శ్రీరెడ్డి. ఆలయంలోని క్యూలైన్లలో శ్రీరెడ్డితో కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. వీడియో చూడండి.