మంగళవారం, 18 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 10 అక్టోబరు 2025 (13:52 IST)

జూబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ చాలా మంచోడు: నటుడు సుమన్ (video)

Suman
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ చాలా మంచివాడని నటుడు సుమన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆయన అందులో మాట్లాడుతూ... నవీన్ యువకుడు. చాలా మంచివాడు. ఇంతకుముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వున్నాడు. అలాంటి మంచి వ్యక్తిని గెలిపించాలి. మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు అంటూ తెలియజేసారు.
 
కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసినట్టు ఏఐసీసీ అధికారిక ప్రటనను విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు నేతలు పోటీ పడినప్పటికీ అదృష్టం మాత్రం నవీన్ యాదవ్‌ను వరించింది. 
 
తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ యువ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి పేర్లను అధిష్టానికి పంపించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును కూడా పరిశీలించినప్పటికీ ఆయన పోటీలో లేనని మంగళవారం స్పష్టం చేశారు. 
 
ఈ నేపథ్యంలో అధిష్టానం వారి పేర్లను పరిశీలించి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన విషయం తెల్సిందే. నవంబరు 11వ తేదీన పోలింగ్ జరుగనుండగా, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.