మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By pnr
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (11:45 IST)

'సాకర్‌' విజేతలకు డబ్బే డబ్బు... ప్రైజ్‌మనీ రూ.256 కోట్లు

రష్యా వేదికగా మరికొన్ని గంటల్లో (గురువారం) ఫిఫా వరల్డ్‌కప్‌ 2018 పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల బరిలో ఏకంగా 32 జట్లు దిగుతున్నాయి. వచ్చేనెల 25వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగ

రష్యా వేదికగా మరికొన్ని గంటల్లో (గురువారం) ఫిఫా వరల్డ్‌కప్‌ 2018 పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల బరిలో ఏకంగా 32 జట్లు దిగుతున్నాయి. వచ్చేనెల 25వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ రష్యా, సౌదీ అరేబియా దేశాల జట్ల మధ్య జరుగనుంది.
 
90 నిమిషాల ఆట.. ప్రతి సెకను ఉత్కంఠ.. నువ్వా నేనా అని.. సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. జస్ట్ 90 నిమిషాల్లోనే గేమ్ ఓవర్.. విజేత కూడా తేలిపోతుంది.. కానీ 90 నిమిషాలే.. ఫుట్ బాల్ అభిమానికి నిజమైన మజా ఇస్తోంది. రెండు దేశాల తరపున 22 మంది కొట్టుకుంటుంటే.. ఆ దేశాలు మొత్తం కళ్లప్పగించి చూస్తుంటాయి. గెలిచేది జట్టే అయినా.. అక్కడ గర్వంగా నిలబడేది మాత్రం ఆ దేశంలోని ప్రజలు.. ప్రతి మ్యాచ్ ఓ మహా సంగ్రామం.. ప్రతి గోల్ ఓ విజయ దాహం.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోన్న సాకర్ సంరంభం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నది. 
 
ఈ ప్రపంచ ఫుట్ బాల్ కప్‌లో మరో విశేషం కూడా ఉంది. అదే డబ్బు.. డబ్బు.. డబ్బు.. ప్రైజ్ మనీనే వేల కోట్లలో ఉంటే.. ఈ టోర్నమెంట్ ఎన్ని లక్షల కోట్లో ఇట్టే చెప్పేస్తోంది.. 2018 ఫుట్ బాల్ ప్రపంచ కప్‌కు 32 జట్లు ఎంపిక అయ్యాయి. వీరికి వందల కోట్లలో ప్రైజ్‌మనీ ప్రకటించారు. ప్రతి జట్టు కనీసం 54 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ తీసుకోబోతున్నది. 
 
గ్రూప్ దశలో ఓడిన జట్టుకు రూ.54 కోట్లు దక్కనున్నాయి. అదే విధంగా ప్రీక్వార్టర్ నుంచి నిష్క్రమించిన జట్టు రూ.81 కోట్లు తీసుకుంటుంది. క్వార్టర్స్‌లో ఓడిన జట్టు రూ.108 కోట్లతో తిరుగుముఖం పడుతుంది. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.148 కోట్లు దక్కనున్నాయి. మూడో స్థానంలో ఉండే జట్టుకు రూ.161 కోట్లు దక్కుతాయి. రన్నరప్‌గా సెకండ్ ప్లేస్‌లో ఉండే జట్టు రూ.188 కోట్ల తీసుకోబోతున్నది. ప్రపంచ విజేతగా నిలిచే జట్టు ఏకంగా రూ.256 కోట్లను కొల్లగొట్టనుంది. మొత్తంగా ఆటగాళ్లు, జట్లకు ప్రైజ్‌మనీగానే.. ఏకంగా రూ.2,701 కోట్లు చెల్లించనుంది అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య. 
 
సంక్షిప్తంగా... 
చాంపియన్‌కు: రూ.256 కోట్లు
రన్నర్‌పకు : రూ.188 కోట్లు
మూడోస్థానానికి: రూ.161 కోట్లు
నాలుగోస్థానానికి: రూ.148 కోట్లు
క్వార్టర్స్‌లో ఓడిన జట్టుకు: రూ.108 కోట్లు
ప్రీ క్వార్టర్స్‌లో ఓడిన జట్టుకు: రూ.81 కోట్లు
గ్రూప్‌ దశలో ఓడిన జట్టుకు: రూ.54 కోట్లు
మొత్తం ప్రైజ్‌మనీ: రూ.2701 కోట్లు