ఉత్తర కొరియా శరణార్థులకు చైనా చెక్.. అమెరికాకు డ్రాగన్ కంట్రీ ఫుల్ సపోర్ట్
ఉత్తర కొరియా శరణార్థులకు చైనా చెక్ పెట్టింది. ఉత్తర కొరియా శరణార్థులు తమ దేశంలోకి రాకుండా సరిహద్దుల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఉత్తర కొరియా శరణార్థులకు గతంలో తామ
ఉత్తర కొరియా శరణార్థులకు చైనా చెక్ పెట్టింది. ఉత్తర కొరియా శరణార్థులు తమ దేశంలోకి రాకుండా సరిహద్దుల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఉత్తర కొరియా శరణార్థులకు గతంలో తాము ఆశ్రయం ఇచ్చిన మాట వాస్తవమేనని.. అయితే అధిక జనాభాతో తాము సతమతమవుతున్నామని.. అదనపు భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఈ పని చేశామని చైనా వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా ఒకటి ఊటంకించింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షల మేరకే తాము ఈ పని చేస్తున్నామని చైనా చెప్తోంది.
కొరియా శరణార్థులకు తాము ఆశ్రయం కల్పిస్తామన్న మాట నిజమేనని అయితే.. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయానికి వచ్చినట్లు చైనా వెల్లడించింది. కానీ అమెరికాతో యుద్ధం జరిగితే ఉత్తరకొరియా చిత్తుగా ఓడిపోతుందని చైనా నమ్ముతోందని.. అందుకే ఆ దేశ శరణార్థులను చైనా నిలువరించిందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఎన్నో సంవత్సరాల పాటు ఉత్తర కొరియాతో ఉన్న అనుబంధాన్ని కూడా చైనా కాదనుకుంటుందని వారు చెప్పారు. ఇందులో భాగంగా ఉత్తర కొరియా శరణార్థులు తమ దేశంలోకి రాకుండా సరిహద్దుల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.