శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 19 జూన్ 2018 (16:01 IST)

స్పీడు పెంచిన సైరా... కార‌ణం ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా. ఈ భారీ చిత్రాన్ని స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విష‌యంలో చిరు కంగారులేదు క్వాలిటీ బాగుండాలి అనే చెప్పేవార‌ట‌. కానీ... ఇప్పుడు ఫాస్ట్‌గా కంప్లీట్ చేయ‌మ‌ని

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా. ఈ భారీ చిత్రాన్ని స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విష‌యంలో చిరు కంగారులేదు క్వాలిటీ బాగుండాలి అనే చెప్పేవార‌ట‌. కానీ... ఇప్పుడు ఫాస్ట్‌గా కంప్లీట్ చేయ‌మ‌ని ఆదేశాలు జారీ చేసార‌ట‌. ఇటీవ‌ల చిరు, అమితాబ్‌ల పైన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారని తెలిసింది. అయితే... చిరు ఇలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయ‌మ‌ని చెప్ప‌డానికి కార‌ణం ఏంటంటే... కొర‌టాల‌తో చేయ‌నున్న సినిమాని ఈ సంవ‌త్స‌రం చివ‌ర‌లో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. 
 
సైరా రిలీజ్ అయ్యే టైమ్‌కి కొర‌టాల‌తో చేయ‌నున్న సినిమా షూటింగ్ 30 శాతం కంప్లీట్ చేయాల‌నేది ప్లాన్. దీనికి త‌గ్గ‌ట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని కొర‌టాల‌కు చిరు చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం కొర‌టాల ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే ప‌నిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే... చిరు ఆదేశంతో సురేంద‌ర్ రెడ్డి టీమ్ ఆగమేఘాల మీద వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. మ‌రి... చిరు చెప్పిన టైమ్‌కి సురేంద‌ర్ రెడ్డి సైరాను కంప్లీట్ చేస్తారో లేదో..?