గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (13:44 IST)

టాక్సీవాలా రివ్యూ రిపోర్ట్.. దెయ్యం కారుతో రైడ్స్ చేసిన అర్జున్ రెడ్డి

సినిమా- టాక్సీవాలా
తారాగ‌ణం- విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్రియాంక జ‌వాల్క‌ర్‌, మాళ‌వికా నాయ‌ర్‌, మ‌ధునంద‌న్‌, సిజ్జు, ఉత్తేజ్‌, యమున‌, క‌ల్యాణి, ర‌విప్ర‌కాశ్, ర‌వివ‌ర్మ‌ త‌దిత‌రులు
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ సంక్రిత్యాన్‌
సంగీతం- జేక్స్ బిజాయ్‌
నిర్మాత‌- ఎస్‌.కె.ఎన్‌
ఛాయాగ్ర‌హ‌ణం- సుజిత్ సారంగ్‌
కూర్పు- శ్రీజిత్ సారంగ్‌
స్క్రీన్‌ప్లే, మాట‌లు- సాయికుమార్ రెడ్డి
నిర్మాణ సంస్థ‌లు- జి.ఎ2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ 
 
నోటాకు తర్వాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా టాక్సీవాలా వచ్చేసింది. టాక్సీవాలా శనివారం (నవంబర్ 17) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో ట్యాక్సీ డ్రైవర్‌గా నటించాడు. ఈ సినిమా డీసెంట్‌గా వుందని ప్రీ రివ్యూ వచ్చేసింది. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా వుందని.. నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు బోర్ అంటున్నారు. బిలో యావరేజ్ సినిమాగా విజయ్ దేవర కొండ ట్యాక్సీవాలా నిలుస్తుందంటున్నారు. 
 
ఈ సినిమాకు పబ్లిసిటీని పక్కనబెడితే పైరసీ పట్టుకుంది. రిలీజ్‌కు ముందే టోరెంట్ సైట్స్‌లో దర్శనమిచ్చింది. ఎన్నో బ్రేకుల మధ్య విడుదలైన ట్యాక్సీవాలా విడుదలైంది. ఈ సినిమా కథలోకి వెళ్తే... శివ (విజయ్ దేవరకొండ) ఉద్యోగం కోసం వస్తాడు. అక్కడ కార్ల రిపేరింగ్ షెడ్ పెట్టుకున్న తన స్నేహితుడు (మధు నందన్)ని కలిసి ఉద్యోగ ప్రయత్నం చేసి పిజ్జా డెలివరీ బోయ్‌గా జాయిన్ అవుతాడు. 
 
కానీ ఆ పని కష్టం తెలుసుకుని.. క్యాబ్ డ్రైవర్‌గా మారుతాడు. సాఫ్ట్ వేర్ వాళ్ల కంటే క్యాబ్ డ్రైవర్లే ఎక్కువ సంపాదిస్తారని.. క్యాబ్‌లో తిరేగే వాళ్ల కంటే క్యాబ్ డ్రైవర్సే హ్యాపీగా వున్నారని చెప్తే.. టాక్సీవాలాగా మారుతాడు విజయ్. ఇలా వదినమ్మ సాయంతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కొంటాడు. అది దెయ్యం కారు అని అతనికి తెలియదు. ఆ దెయ్యం కారును కొనుక్కుని తమ కష్టాలు తీర్చే దేవుడులా దణ్ణం పెడతాడు. అక్కడ నుంచి టాక్సీ రైడ్స్ మొదలవుతాయి. 
 
టాక్సీ ఫస్ట్ రైడ్‌లోనే అను (ప్రియాంక జవాల్కర్) ప్రేమలో పడతాడు. ఇక జీవితం సాఫీగా సాగుతుందని అనుకునేలోపు టాక్సీలో దెయ్యం వుందని తెలుసుకుంటాడు..శివ. ఆ కారు కొన్నప్పటి నుంచి ఆ కారు.. శుభ్రం చేయకపోయినా.. మెరుస్తూనే వుటుంది. కారులో ఎఫ్‌ఎమ్ స్టేషన్స్ అన్నీ అవే మారుతూ వుంటాయి. డోర్ విండోలు అవే క్లోజ్ అవుతుంటాయి. 
 
ఏసీ వేయకపోయినా చల్లగా ఉంటుంది. ఇదంతా గమనించిన శివ కారును వదులుకోవాలనుకుంటాడు. కానీ అది అతనిని విడిచిపెట్టదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఆ కారు ఓ మర్డర్ కూడా చేస్తుంది. ప్రస్తుతం జడుసుకున్న శివ.. ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతాడు.. ఈ ట్యాక్సీ దెయ్యానికి అను, శిశిర (మాళవిక నాయర్)లకు ఉన్న సంబంధం ఏమిటనేది మిగిలిన కథ. 
 
విశ్లేషణ: 
సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో విజయ్ దేవరకొండ బాగానే నటించాడు. కథను దర్శకుడు రాహుల్ బాగానే ఎంచుకున్నాడు. కథను అద్భుతంగా చూపించడంలోనూ సక్సెస్ అయ్యాడు. సినిమాకు ప్రధాన బలం కామెడీ. తొలి అర్థభాగం, హీరో, స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయి.

సరాదాగా సినిమా సాగిపోతుంది. రెండో అర్థభాగం ఎంటర్‌టై‌న్‌మెంట్ కాస్త తగ్గినా మార్చురీ సీన్ బాగుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. గ్రాఫిక్స్ నిరాశపరుస్తాయి. ఈ తరహా సినిమాలకు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సుజిత్ సారంగ్ సినిమా విజువల్స్ చక్కగా వున్నాయి. 
 
నటీనటుల నటన ఆకట్టుకుంది. హీరోయిజం, స్టైల్‌తో పాటు ఎమోషన్స్, భయం బాగా చూపెట్టాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో విజయ్ అదరగొట్టేశాడు. హీరోయిన్‌గా ప్రియాంక గ్లామర్ ఆకట్టుకుంది. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. ఇతర పాత్రలో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్, ఉత్తేజ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు.