అభిమానులకు క్షమాపణ చెప్పిన రణ్‌వీర్...అలా దూకడమేంటో?
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ మధ్యకాలంలో పెళ్లి జోష్‌తో, ఇంకా సినిమా విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కొన్ని సందర్భాలలో విచిత్రమైన చేష్టలతో వార్తలకెక్కుతుంటాడు ఈ హీరో. తాజాగా ఆయన చేసిన ఒక పనికి అభిమానులు గాయపడగా, క్షమాపణలు కోరాల్సి వచ్చింది.
ఇటీవల లాక్మీ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో "అప్నా టైమ్ ఆయేగా" అనే పాటను పాడుతూ ఒక్కసారిగా అభిమానుల గుంపుపైకి దూకాడు రణ్‌వీర్ సింగ్. ఊహించిన ఈ పరిణామంతో అభిమానులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయన కింద పడి కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. తేరుకున్న అభిమాను సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చర్యను పలువురు తప్పుబడుతూ ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ రణ్‌వీర్ తాను చేసిన పని వలన ఇబ్బందిపడిన అభిమానులను క్షమాపణలు కోరారు. ఇకమీదట ఇలాంటి పనులు చేయని, అభిమానుల ప్రేమ, ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరారు. రణ్‌వీర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన గల్లీభాయ్ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నాడు.