బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (11:22 IST)

చీరకట్టుతో దీపికా ఇబ్బందులు.. సర్దిన రణ్ వీర్ సింగ్..

ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఓ ఇంటివారైన రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే బెంగళూరులో జరిగిన రిసెప్షన్‌లో అదరగొట్టారు. రిసెప్షన్ కోసం దీపిక బంగారు వర్ణంలో మెరిసిపోతున్న చీరను ధరించగా, రణ్ వీర్ మాత్రం బ్లాక్ షేర్వానీతో మెరిసిపోయాడు. 
 
వేదికపై తాను కట్టుకున్న చీర సరిగ్గా సెట్ కాక దీపిక ఇబ్బంది పడిన సమయంలో రణ్ వీర్ చీరను సరిదిద్దాడు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపిక చీరను సరిచేసిన రణ్ వీర్, బెస్ట్ హజ్బెండ్ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. ఇకపోతే.. ఈ నెల 28వ తేదీన, వచ్చే నెల 1న ముంబైలో మరో రెండు రిసెప్షన్లను దీపికా, రణ్ వీర్ జంట ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు రోహిత్ బాల్ క్రియేషన్‌లో డిజైన్ చేసిన దుస్తులనే రణ్ వీర్ సింగ్ ఫ్యామిలీ బెంగళూరు రిసెప్షన్‌కు ధరించింది. గురువారం సాయంత్రం రణ్ వీర్ సింగ్ మదర్ అంజు భవానీ, తండ్రి జగ్జిత్ సింగ్ భవానీ, సోదరి రితికా భవానీలు రోహిత్ డిజైన్ చేసిన దుస్తులతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.