శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (11:42 IST)

బెంగళూరులో దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్‌ల రిసెప్షన్ అదిరింది..

బాలీవుడ్ కొత్త జంట దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్‌ల రిసెప్షన్ బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ రిసెప్షన్‌కు సంబంధించి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


సెలెబ్రిటీలు పూజా మకిజియా, రణ్‌వీర్ కజిన్‌లతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన దీపికా, రణ్‌వీర్ రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. 
 
సంప్రదాయ దుస్తుల్లో దీపికా, రణ్‌వీర్ మెరిశారు. బంగారు రంగులో మెరిసే పట్టుచీరలో దీపిక అదిరిపోయింది. నలుపు రంగు షేర్ వానీలో రణ్ వీర్ కనబడ్డాడు. ఈ రిసెప్షన్‌కు వెళ్లిన సెలెబ్రిటీలు వారితో సెల్ఫీలు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంకా రిసెప్షన్ సూట్‌లో తీసుకున్న ఫోటోను రణ్ వీర్, దీపికా నెట్టింట్లో పోస్టు చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.