సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (18:43 IST)

జోధ్‌పూర్‌లో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ వివాహం.. జోరుగా ఏర్పాట్లు?

బాలీవుడ్ జంట దీపికా- రణ్‌వీర్ పెళ్లి వేడుక ఇటలీ జరిగింది. మరికొన్ని రోజుల్లో ప్రియాంక చోప్రా పెళ్లి తంతు ప్రారంభం కానుంది. తన ప్రియుడు నిక్ జోనాస్‌ను దేశీ గర్ల్ వివాహం చేసుకోనుంది. వీరి వివాహం వేదిక జోధ్‌పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి ప్రియాంక- నిక్‌ల వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని టాక్. 
 
మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జోధ్‌పూర్‌లో దేశీ స్టైల్‌లో వీరి వివాహం జరుగనుండగా, అమెరికాలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్ వీర్ సింగ్- దీపికా పదుకునేల వివాహం నవంబర్ 14, 14 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు భారీ లైక్స్ వస్తున్న వేళ.. దీపికా, రణ్‌వీర్‌లకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.