సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (17:33 IST)

కపిల్ దేవ్ బయోపిక్‌లో అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి, గీత గోవిందం హీరో, యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ బయోపిక్‌లో నటించనున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్‌ను దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు ''83'' అనే టైటిల్‌ను ఖరారు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. 
 
ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించినట్లు బిటౌన్ వర్గాల సమాచారం. కాగా కపిల్ దేవ్ స్నేహితుడు ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కథకు కీలకం కావడంతో ఆ పాత్రలో విజయ్ దేవరకొండను నటింపజేసేందుకు కబీర్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 2020లో సినిమా విడుదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్.