గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (15:13 IST)

నీటి లారీకి బలైపోయిన బాలిక.. చేతిలో చాక్లెట్ కవర్..

చెన్నైలో నీటి లారీకి ఓ విద్యార్థిని బలైపోయింది. చెన్నై కీల్పాక్కం‌లో ఓ నీటి లారీ 12 ఏళ్ల బాలికను బలిగొంది. ఈ ఘటన చిన్నారి కుటుంబీకులను విషాదంలో ముంచేసింది. స్కూల్ నుంచి 12ఏళ్ల విద్యార్థిని తన బంధువుతో మోటార్ సైకిలుపై ఇంటికి వస్తుండగా.. బండి అదుపు తప్పింది. దీంతో మోటార్ సైకిలుపై వున్న ఇద్దరు కిందపడ్డారు. 
 
కిందపడిన బాలికను స్థానికులు కాపాడేందుకు పరుగులు తీసేలోపే నీటి లారీ చక్రాలు ఆ బాలికపైగా దాటుకెళ్లిపోయాయి. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇంకా ఆ బాలిక చేతిలో చాక్లెట్ వుండటాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు.