శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (12:03 IST)

గజా ఓ వైపు.. భారీ వర్షాలు మరోవైపు.. తమిళనాడు ప్రజల నానా తంటాలు

తమిళనాడు దక్షిణాది జిల్లాలను గజా తుఫాను అతలాకుతలం చేసింది. తాజాగా మరో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు ఏడు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 


నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. మరో 45 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలతో పాటు మద్రాస్ యూనివర్శిటీ పరీక్ష తేదీలను మార్పు చేసింది. 
 
తమిళనాడు, పుదుచ్చేరిల్లో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. కాంచీపురం, తిరువళ్లూరు, విలుప్పురం జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఇక గజా తుఫాను కారణంగా 46 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 
 
గజా తుఫాను ధాటికి నాగపట్నం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా భారీ వర్షాల కారణంగా ప్రభుత్వాధికారులు అప్రమత్తంగా వుండాలని వర్ష బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో వుండాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.