సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (18:38 IST)

నా పేరు పవన్ కళ్యాణ్.... నేనే సీఎం అభ్యర్థిని... అన్నిచోట్లా పోటీ...(Video)

తమిళనాడులో పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.. అందరికీ నమస్కారం అంటూ తమిళంలో ప్రసంగం ప్రారంభించిన పవన్ నా పేరు పవన్ కల్యాణ్ అని పరిచయం చేసుకున్నారు. 2014లో జనసేన పార్టీని ప్రారంభించినట్టు చెప్పారు. దేశ రెండో రాజధానిని వెంటనే దక్షిణ భారతదేశంలో పెట్టాలని డిమాండ్ చేశారు. 

చూడండి వీడియోలో పవన్ కల్యాణ్ కోసం చెన్నై ఎయిర్ పోర్టులో అభిమానులు...
 
దక్షిణాది రాష్ట్రాలు అంతా ఒక్కటవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు చెన్నైతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. చెన్నైలో తెలుగువారు ఎప్పుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడలేదనీ, కానీ ఏ తప్పు లేకపోయినా ఆంధ్రా ప్రజలు తెలంగాణలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బాధపడ్డారని విభజన నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. 
 
ఇక పొత్తుల గురించి మాట్లాడుతూ వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదని.. తాము స్వతంత్రంగా పోటీ చేయనున్నట్టు వెల్లడించిన ఆయన నేనే సీఎం అంటూ పవన్ స్పష్టం చేశారు. ఏపీలో త్రిముఖ పోటీ జరుగనుందని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడుతున్న మహాకూటమి విఫలమవుతుందన్నారు జనసేనాని.


చూసచూ;చూచ;t;;;;;;;