శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 21 నవంబరు 2018 (11:54 IST)

ప‌వ‌న్ ఆ ప్ర‌క‌ట‌న చేయడం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఇదే..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం జ‌న‌సేన పార్టీని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం కోసం ఎంత‌గా క‌ష్ట‌ప‌డుతున్నారో తెలిసిందే. తూర్పుగోదావ‌రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప్ర‌చారంలో జోరు పెంచారు. ఇదిలా ఉంటే... ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌నున్నారు అని వార్త‌లు రావ‌డం మొద‌ల‌య్యాయి. ఈ వార్త‌లు ప‌వ‌న్‌కి చేరాయి. అంతే... నేను ఓ సినిమాలో న‌టించ‌డం లేదు. ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా ప్ర‌జా సేవ పైనే ఉంది.
 
ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల్లో వాస్త‌వం లేదు అంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ఇప్పుడు ఇది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే... సినిమా రంగంలో ఇలాంటి వార్త‌లు రావ‌డం కామ‌న్. ప‌వ‌న్ కూడా ఇప్ప‌టివ‌ర‌కు త‌న సినిమాల గురించి వ‌చ్చిన వార్త‌ల‌ను అంత‌గా ప‌ట్టించుకోలేదు. 
 
మ‌రి... ఇప్పుడు ప్ర‌చారంలో ఉన్న వార్తపై స్పందించ‌డానికి కార‌ణం ఏంటంటే.. నిర్మాత తాళ్లూరి ప‌వ‌న్ సినిమా చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఎనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని టాక్ వ‌చ్చింది. దీంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌మ అడ్వాన్స్ ప‌వ‌న్ ద‌గ్గ‌ర ఉండ‌టంతో మాకు కూడా సినిమా చేయండి అని ప‌వ‌న్‌కి క‌బురు పంపార‌ట‌. వేరే బ్యాన‌ర్లో సినిమా చేస్తున్నాన‌ని వార్త రావ‌డం వ‌ల‌నే క‌దా మైత్రీ మూవీ మేక‌ర్స్ అడ్వాన్స్ ఉంది సినిమా చేయండి అని అడిగారు. మ‌రొక‌రు వ‌చ్చి కూడా సినిమా చేయ‌మంటారు అని చెప్పి క్లారిటీ ఇద్దామ‌ని ప్రెస్ నోట్ రిలీజ్ చేసార‌ట‌. అదీ.. సంగ‌తి.