శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (15:33 IST)

నోటాతో అర్జున్ రెడ్డికి మచ్చ.. కలెక్షన్లు అంతంత మాత్రమే..

తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన నోటా సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాలా సినిమాతో సక్సెస్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసినా.. ''నోటా'' సినిమా డిజాస్టర్ మాత్రం అతని కెరీర్‌లో బ్లాక్ మార్కుగా నిలిచిపోయింది. అక్టోబర్ ఐదో తేదీన విడుదలైన నోటా బయ్యర్స్‌కి నోటా సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. 
 
కలెక్షన్ల పరంగా ఆరాతీస్తే.. రూ.25కోట్ల థ్రియేటికల్ వాల్యూ కలిగిన నోటా రూ.12.55 కోట్ల షేర్స్‌ను మాత్రమే అందించింది. తమిళనాడులో భారీ స్థాయిలో రిలీజ్ చేసినా.. కేవలం రెండు కోట్ల షేర్స్‌ను మాత్రమే నోటా అందుకోగలిగింది. ఇక నైజాం-ఏపీల్లో అనుకున్నంత స్థాయిలో నోటాకు కలెక్షన్లు లేవు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ.7.85 కోట్ల రూపాయల షేర్ మాత్రమే అందాయి.