సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 18 నవంబరు 2018 (15:05 IST)

'టాక్సీవాలా'తో గాడిలోపడిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం "టాక్సీవాలా". ఈ చిత్రం శనివారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పైగా, పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన తొలి రోజే రూ.10 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. 
 
'గీతగోవిందం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వచ్చిన "నోటా" చిత్రం పూర్తి నిరాశపరిచిన విషయం తెల్సిందే. ఇపుడు టాక్సీవాలాతో విజయ్ దేవరకొండ మళ్లీ గాడిలోపడినట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాక్సీవాలాకు తొలి షో నుంచే మంచి టాక్ రావడం, పైగా తొలిరోజునే రూ.10.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. 
 
గీతాఆర్ట్స్-2 పిక్సర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, ఇదులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్. మాళవికా నాయర్, కళ్యాణి వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించగా, జేక్స్ బిజాయ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం విడుదలకు ముందు అనేక అవాంతరాలను ఎదుర్కొని రిలీజ్ అయింది.