సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (14:01 IST)

చెన్నై హోటళ్లల్లో కుక్కమాంసం? ఎగ్మోర్‌లో 1000 కేజీలు పట్టేశారు..

చెన్నై హోటళ్లలో కుక్కమాసం కలుపుతున్నారని షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గతంలో పిల్లి మాంసాన్ని తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని పెద్ద పెద్ద రెస్టారెంట్లలో, రోడ్డు షాపుల్లో పిల్లి మాంసంతో వండిన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పిల్లి మాంసంతో కూడిన ఆహారాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. 
 
తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దాదాపు 1000 కేజీల కుక్క మాంసాన్ని చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ అధికారులు కనుగొన్నారు. థర్మాకోల్ పెట్టెలో ఐస్ మధ్య కుక్క మాంసాన్ని జోధ్ పూర్ నుంచి చెన్నై ఎగ్మోర్‌కి దిగుమతి చేసినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. గణేష్ వ్యక్తి పేరిట ఈ కుక్కమాంసాన్ని సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. 
 
ఫోన్‌లో అందిన సమాచారం ప్రకారం రైల్వే అధికారులు ఈ వెయ్యి కేజీల కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. చర్మం తొలగించిన కుక్క మాంసాన్ని పెట్టెల్లో భద్రపరిచి జోధ్ పూర్ నుంచి చెన్నైకి రైళ్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.