శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (11:14 IST)

ఎస్ఆర్ఎం వర్శిటీకి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ కేటాయించిన నాక్

చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎం యూనివర్శిటీ)కి అత్యుత్తమ గ్రేడ్ అయిన ఏ ప్లస్ ప్లస్ వరించింది. ఈ గ్రేడ్‌ను నేషనల్ అసెస్సెమెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (ఎన్.ఏ.ఏ.సి) కేటాయించింది. ఈ గ్రేడ్ కోసం ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో నాక్ బృందం చేపట్టిన అధ్యయనం, పరిశీలనతో ఏకంగా 3.55 పాయింట్లు లభించాయి. దీంతో ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్‌ను ఎస్ఆర్ఎం యూనివర్శిటీ సొంతం చేసుకుంది. 
 
ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 33 విశ్వవిద్యాలయాలు పోటీ పడగా, అందులో కేవలం రెండండే రెండు విద్యా సంస్థలకు మాత్రమే ఈ గ్రేడ్ లభించింది. ముఖ్యంగా, తమిళనాడు నుంచి ఈ గ్రేడ్ పొందిన ఏకైక విద్యా సంస్థ ఎస్ఆర్ఎం కావడం గమనార్హం. 
 
ఇకపోతే, ఈ గ్రేడ్‌ను దక్కించుకోవడం వల్ల కేటగిరీ యూనివర్శిటీ 1 జాబితాలో ఎస్ఆర్ఎం కూడా చేరింది. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ యాక్ట్ 1956, 12బి సెక్షన్ల ప్రకారం కేటగిరీ 1 యూనివర్శిటీ జాబితాలో చోటు దక్కించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో పాటు.. యూజీసీలు వివిధ పరిశోధనలు, ప్రాజెక్టుల కోసం నిధులను కేటాయించనున్నాయి. ఈ విషయాన్ని ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ సందీప్ సంచేటి, ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్, రిజిస్ట్రాల్ ఎన్. సేతురామన్‌లు వెల్లడించారు.