గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (19:07 IST)

వామ్మో... తృటిలో తప్పించుకున్న విజయ్ దేవరకొండ (Video)

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. కదిలే రైలును ఎక్కేందుకు విజయ్ దేవరకొండ ప్రయత్నించడంతో జారి పడ్డాడు. దీనితో అతడికి గాయాలయ్యాయి. ఆ గాయాల తాలూకు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసుకున్నాడు విజయ్. తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ సైట్స్ పైన గాయపడినట్లు తెలుస్తోంది. ఇది కాకినాడలో జరిగింది.
 
తన ప్రమాదంపై విజయ్ స్పందిస్తూ...  జీవితంలో ఏదీ ఊరికే రాదు అంటూ కామెంట్ చేస్తూ ఫొటో పెట్టారు. కాగా విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ లిస్టులో చేరిపోయిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, నోటా, టాక్సీవాలా ఇలా వరుస హిట్ చిత్రాలతో దూసుకువెళ్తున్న సంగతి తెలిసిందే. చూడండి వీడియోలో...