మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 1 డిశెంబరు 2018 (20:14 IST)

జాన్వీతో మూవీ గురించి విజయ్‌ దేవరకొండ ఏమ‌న్నాడో తెలుసా..?

టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ తాజాగా మరోసారి బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ షోలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ విజయ్‌ దేవరకొండ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది. 
 
ఏమ‌న్న‌దంటే... జెంట్‌లా నిద్ర లేవాల్సి వ‌స్తే ఎవ‌రిలా ఉండాల‌నుకుంటున్నావ్ అని అడిగితే... మ‌రో ఆలోచ‌న లేకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చెప్పింది. ఇదే విష‌యంపై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందిస్తూ... త్వరలో జాన్వీ, కరణ్‌ జోహార్‌లతో సినిమా చేస్తా అని చెప్పాడు. దీంతో అభిమానుల అంచనాలను మరింత పెంచేశాడు అని చెప్ప‌చ్చు. మ‌రి.. నిజంగానే చేస్తాన‌ని చెప్పాడా..? లేక స‌ర‌దాగా అన్నాడా అనేది తెలియాల్సివుంది.