శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (10:54 IST)

ఎంతటి స్టార్‌కైనా సక్సెస్‌ అనేది నమ్మకం పెంచుతుంది : ప్రియాంకా జవాల్కర్

ఒక చిత్రం విజయం అనేది ఎంతటి స్టార్‌కైనా నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంచుతుందని టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ అన్నారు. ఈమె యువ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన చిత్రం "టాక్సీవాలా". ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. 
 
ఈ చిత్రం విజయంపై ప్రియాంకా జవాల్కర్ స్పందిస్తూ, ఎంతటి స్టార్‌కైనా సరే.. సక్సెస్ అనేది నటనపై న‌మ్మ‌కాన్ని పెంచుతుంది. అలాంటి న‌మ్మ‌కాన్ని నాకు క‌లిగించిన చిత్ర‌ం 'టాక్సీవాలా'. ఈ చిత్ర విజయంతో ఇకపై నా నుంచి రాబోయే సినిమాలు కానీ, స్క్రిప్టులు కానీ ఎంతో ఉన్నతంగా ఉంటాయని చెప్పగలను. అంతటి ఆత్మవిశ్వాసాన్ని పెంచిన చిత్రం ఈ సినిమా అని చెప్పారు.
 
నిజానికి 'టాక్సీవాలా' చిత్రంలో నటించేందుకు సంతకం చేసి రెండేళ్లయింది. కానీ కొన్ని అవాంతరాల వల్ల ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగిందన్నారు. ఈ చిత్రం తర్వాత అంగీకరించిన విజేత చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని విడుదల కూడా అయిందని గుర్తు చేశింది. ఈ చిత్రంలో నా పాత్ర లేకుండా కథను ఊహించలేరు. అలాంటి మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అని చెప్పారు. టాక్సీవాలా అంటే మందుగా గుర్తుకు వచ్చే పాత్ర సిసిర అని ప్రియాంకా జవాల్కర్ చెప్పుకొచ్చారు.