శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 19 నవంబరు 2018 (18:26 IST)

టాక్సీవాలా సినిమా పైరసీ రాగానే చచ్చిపోయిందనుకున్నా...(Video)

అర్జున్ రెడ్డి, గీతగోవిందం తరువాత నోటా సినిమా హిట్ కాకున్నా టాక్సీవాలతో మరోసారి తానేంటో నిరూపించుకున్నారు విజయ్ దేవరకొండ. తాజాగా విడుదలైన టాక్సీవాలా సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే సినిమా విడుదలకు ఒక వారం ముందుగానే ఫైరసీ రిలీజైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను టాక్సీవాలా సినిమా పైరసీ రిలీజ్ చర్చకు దారితీసింది. అయితే పైరసీ విడుదలపై సినీ హీరో విజయ్ దేవరకొండ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
 
ట్విట్టర్ వేదికగా కొన్ని ట్వీట్లు కూడా చేశారు విజయ్ దేవరకొండ. ఎంతో కష్టపడి తీసిన సినిమా ఇది. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా తీస్తే మూవీ విడుదల రోజే పైరసీ రిలీజైంది. నాకు అది తెలిసి టాక్సీవాలా చచ్చిపోయిందని అనుకున్నా అంటున్నారు విజయ్ దేవరకొండ. పైరసీపై దృష్టి పెట్టండి అంటూ ఒకవైపు పోలీసులను కోరుతూ మరోవైపు పైరసీ సినిమాలు చూడొద్దంటూ కోరారు విజయ్ దేవరకొండ. చూడండి వీడియో...