శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 16 నవంబరు 2018 (13:52 IST)

పెద్ద డైరెక్ట‌ర్‌తో విజ‌య్ సినిమా... రాజమౌళి కాదు కదా?

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న‌ యువ సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తోన్న‌ విజయ్ దేవరకొండ తాజా చిత్రం టాక్సీవాలా. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న‌ ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్ న‌టించారు. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పైన రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన టాక్సీవాలా చిత్రం ఈ నెల 17న విడుదల కాబోతుంది.
 
ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌చేసారు. పెళ్లి చూపులు సినిమా తరువాత ఒప్పుకున్న సినిమా ఇదని.. ఈ కథ విన్నప్పుడే చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. కథ చెప్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. 
 
ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చక్కగా వచ్చి సినిమా చూసే విధంగా ఉంటుంది అన్నారు. ఇదిలా ఉంటే... వ‌చ్చే సంవ‌త్స‌రం ఖచ్చితంగా ఓ పెద్ద డైరెక్టర్‌తో సినిమా చేస్తాను. ఆయన ఎవరో ఇప్పుడు చెప్పలేను కానీ.. ఆయన సినిమాలకి మాత్రం పెద్ద అభిమానిని. అలాంటిది ఆయనే నాతో ఓ సినిమా చేస్తావా అని నన్ను అడగటం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పాడు కానీ... ఆ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది మాత్రం చెప్ప‌లేదు. ఎవరై వుంటారబ్బా? ఎస్ఎస్ రాజమౌళి కాదు కదా?