బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (12:12 IST)

తాబేలు బొమ్మను ఇంట్లో వుంచితే.. మంచి జరుగుతుందా?

వాస్తు దోషాలను తొలగించుకోవాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. అలా పాటిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. నిజానికి తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇళ్లు నివాసానికి పనికిరాదని పెద్దలు అంటూ వుంటారు. కానీ వాస్తు నిపుణులు మాత్రం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే.. వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు.
   
 
చైనా వాస్తు అని పిలువబడే ఫెంగ్‌షుయ్ పద్ధతిలో తాబేలు ఎలా తన ఐదు అవయవాలను (తల, నాలుగుకాళ్లను) ఎలా లోనికి లాక్కొని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో.. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు.. ఆయుర్దాయం, శుభాలకు సంకేతంగా చెప్పబడుతోంది. అందుకే లోహంలో తయారు చేయబడిన తాబేలును.. నీటితో నింపిన బౌల్‌లో వుంచి.. ఇంట్లో ఉత్తర దిశలో వుంచాలి. 
 
ఉత్తర దిశలో పడకగది వున్నట్లైతే నీరు లేని లోహంతో తయారైన తాబేలును వుంచవచ్చు. ఇలా చేస్తే.. ఆయురారోగ్యాలు, ఆర్థికాభివృద్ధి, శత్రుభయం, శత్రుదోషాలు, నరదృష్టి, అసూయ, ఈర్ష్య ప్రభావం మనపై వుంటే తొలగిపోతుంది. తాబేలు మాత్రమే కాకుండా.. తాబేలు లాంటి కూర్మావతారం వంటి శంఖం, కామధేనువు, కల్పవృక్షం, శమంతకమణి, ఐరావతం వంటివి వాస్తు దోషాలను తొలగిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెప్తున్నారు.
 
కూర్మావతారం విష్ణు భగవానుని దశావతారాల్లో రెండోవది. రెసిన్లు, మెటల్, గ్లాస్, స్ఫటికాలు, చెక్కలతో చేసిన తాబేలు బొమ్మల్ని షాపుల్లో అమ్ముతారు. ముఖ్యంగా లోహాలలో చేసిన బొమ్మను ఇంట్లో లేదా ఆఫీసుల్లో వుంచితే.. శత్రువిజయం వుంటుంది. క్రిస్టల్‌లో చేసిన తాబేలు బొమ్మను.. నైరుతి లేదా వాయువ్యంలో వుంచటం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
రంగుల రాళ్లతో నింపిన నీటిలో ఈ బొమ్మను వుంచాలి. తాబేలు పాదాలు నీటిలో మునిగేలా ఈ బొమ్మను వుంచాలి. ఇలా చేస్తే ఆ ఇంట ప్రశాంతత, సామరస్యం, శాంతి, దీర్ఘాయుష్షు, ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది.