కొందరైతే పెద్ద పెద్ద ఇంటి నిర్మాణాలు చేస్తుంటారు. అలా కట్టుకుంటే బాగుంటుందని భావిస్తారు. ఇటువంటి పెద్ద ఇంటికి లిఫ్టుంటే ఇంకా మంచిదని అనుకుంటారు. కానీ ఆ లిఫ్టును ఏ దిశలో అమర్చుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. కనుక వాస్తుశాస్త్రం ప్రకారం లిఫ్టును ఏ దిశలో కట్టుకోవాలో తెలుసుకుందాం.. ఇంటిలోపలి నైరుతిలో, ఈశాన్యంలో లేదా ఇంటి గర్భంలో కాకుండా లిఫ్టును అన్ని చోట్లా పెట్టుకోవచ్చును. వాయవ్యంలోనే రావాలి అనేది లేదు. ఎందుకైనా ఇంటి...