గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: గురువారం, 4 అక్టోబరు 2018 (21:21 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని యువకుడి ఆత్మహత్య

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.బి కాలనీకి చెందిన నవీన్ 24 సంవత్సరాల యువకుడు అదే కాలనీకి చెందిన ఒక యువతిని ప్రేమించి ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్నాడు.

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.బి కాలనీకి చెందిన నవీన్ 24 సంవత్సరాల యువకుడు అదే కాలనీకి చెందిన ఒక యువతిని ప్రేమించి ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే గడిచినా, వీరి మధ్య ఏమయిందో తెలియదు గాని గత కొన్ని రోజులుగా ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. 
 
అయితే అనేకసార్లు కలిసుందాం వచ్చెయ్యమని నవీన్ తన భార్యతో చెప్పినా ఆమె వినకుండా తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉండిపోయింది. ఎంత బతిమిలాడినా వినకపోవడంతో నిన్న రాత్రి తల్లితో చెప్పి బాధపడి గదిలోకి వెళ్లిపోయాడు. ఉదయం తలుపు ఎంతకీ తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు.
 
మరణించిన కొడుకుని చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వెంటనే విషయాన్ని నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కొడుకు నవీన్ చావుకు తన కోడలు పరోక్షంగా కారణం అని తెలిపింది.