ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (10:53 IST)

వాట్సాప్ వినియోగంపై భార్యాభర్తల కీచులాట... ఇద్దరూ ఆత్మహత్య

సికింద్రాబాద్‌ మారేడ్‌ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వాట్సాప్‌ చాటింగ్‌ ఇద్దరిని బలిగొంది. యువతితో ఎందుకు వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తున్నావని భర్తను భార్య నిలదీసింది.

సికింద్రాబాద్‌ మారేడ్‌ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వాట్సాప్‌ చాటింగ్‌ ఇద్దరిని బలిగొంది. యువతితో ఎందుకు వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తున్నావని భర్తను భార్య నిలదీసింది. ఈ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెబుతానని అనడంతో మనస్థాపానికి గురైన భర్త శివకుమార్‌ రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తన వల్లే శివకుమార్‌ మృతి చెందాడని స్థానికులు అనడంతో మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌కు చెందిన వెన్నెల అనే యువతి నిన్న మధ్యాహ్నం యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వాట్సాప్‌ చాటింగ్‌ కారణంగా ఇద్దరూ రెండ్రోజుల వ్యవధిలో మృతి చెందడంతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న మారేడ్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.