శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (18:02 IST)

మిలటరీలో ఉద్యోగం మానేసి వచ్చిన వ్యక్తితో ''ఆ'' సంబంధం.. భర్తను చంపేసింది..?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య బాంధవ్యాలు.. అక్రమ సంబంధాల కారణంగా నేరపూరితంగా మారిపోతున్నాయి. వివాహ వ్యవస్థపై భావితరానికి వున్న నమ్మకం సన్నగిల్లిపోతుంది. తాజాగా అనంతపురం జిల్లా కొ

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య బాంధవ్యాలు.. అక్రమ సంబంధాల కారణంగా నేరపూరితంగా మారిపోతున్నాయి. వివాహ వ్యవస్థపై భావితరానికి వున్న నమ్మకం సన్నగిల్లిపోతుంది. తాజాగా అనంతపురం జిల్లా కొటిపి సమీపంలో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేయించింది. కానీ భర్తను హత్య చేశాక.. ప్రియుడితో కలిసి మృతదేహాన్ని తరలించే క్రమంలో గ్రామస్థుల కంటపడింది.
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా చెన్న‌కొత్తపల్లి దామాజిపల్లికి చెందిన రామాంజినప్ప, ఆదెమ్మ దంపతులు. కొంతకాలం క్రితం కూలీ పనుల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన గౌరీబిదనూరుకు వలస వెళ్లారు. ఇంతలో మిలటరీలో ఉద్యోగం మానేసి వచ్చిన లేపాక్షికి చెందిన నగేష్ కూడ గౌరీబిదనూరులోని తన సమీప బంధువు ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలోనే ఆదెమ్మతో నగేష్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రామాంజినప్పకు తెలిసింది. 
 
అతడు గట్టిగా భార్యను మందలించినా ఫలితం లేకపోయింది. ఇక తన అక్రమ సంబంధానికి భర్తను అడ్డుగా భావించిన ఆదెమ్మ కట్టుకున్న భర్తను హత్య చేయించింది. ఇందుకు ప్రియుడు కూడా సహకరించాడు. కానీ భర్త మృతదేహాన్నితరలించే క్రమంలో ఆదెమ్మ ఆమె ప్రియుడు స్థానికులకు చిక్కారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ దర్యాప్తులో రామాంజినప్ప భార్య ఆదెమ్మతో తనకు వివాహేతర సంబంధం ఉందని నగేష్ ఒప్పుకొన్నాడు. రామాంజినప్పను హత్య చేస్తే  తమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించి  ఈ హత్య చేసినట్టు నగేష్ పోలీసులకు వివరించారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.