శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : శనివారం, 29 సెప్టెంబరు 2018 (17:28 IST)

రేవంత్ రెడ్డి స్వాతిముత్యంలో కమల్ కాదు.. విశ్వరూపంలో కమల్ హాసన్- బాల్క సుమన్

టీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఆర్థిక అరాచకవాది అంటూ బాల్కా సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ స్వాతిముత్యంలో కమల్ కాదు.. వి

టీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఆర్థిక అరాచకవాది అంటూ బాల్కా సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ స్వాతిముత్యంలో కమల్ కాదు.. విశ్వరూపంలో కమల్ హాసన్ అంటూ ఫైర్ అయ్యారు. 
 
తామంతా తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినప్పుడు రేవంత్‌.. చంద్రబాబు పక్కన ఉన్నారని, ఇప్పటికీ రేవంత్ చీకటి బాస్ చంద్రబాబు అని... ఆయన అండతో చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఏజెంట్‌లా రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని సుమన్‌ ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీలో బాల్క సుమన్ కూర్చుంటాడో, రేవంత్ రెడ్డి కూర్చుంటాడో చూద్దామని సవాల్ విసిరారు. 
 
నిప్పులాంటి కేసీఆర్ కుటుంబంపై రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. ఐటీ దాడులకు, టీఆర్‌ఎస్‌కి సంబంధం ఏమిటని సుమన్ ప్రశ్నించారు.  కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని.. ఆయనపై అనవసర వ్యాఖ్యలు చేస్తే నాలుకను చీలుస్తామని హెచ్చరించారు. 
 
రేవంత్‌ చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు తానొక్కడినే చాలునని.. ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ల అవసరం వుండదని చెప్పుకొచ్చారు. అలాకుంటే ఉరికించి కొడతా.. తాట తీస్తా నంటూ సుమన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వెయ్యి ఏకరాలంటున్న రేవంత్‌.. దాన్ని నిరూపించకపోతే గజ్వేల్‌లో బొంద పెడతామన్నారు. తెలంగాణ తులసీ వనంలో రేవంత్ రెడ్డి గంజాయి మొక్క అని బాల్క సుమన్ మండిపడ్డారు. 
 
రేవంత్ దేశ ద్రోహి, ఎన్నికల పోటీకి అనర్హుడని ధ్వజమెత్తారు. బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరస్థుడు రేవంత్ అంటూ సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.