శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:27 IST)

ఢిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ నాపై కుట్రలు పన్నుతున్నారు

ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డ

ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. 
 
కానీ తన ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని మాత్రం ఆపలేదు. తన నియోజకవర్గంలో ప్రచారాన్ని యదావిధిగా కొనసాగించారు. ప్రచారం తర్వాతే ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. భావోద్వేగానికి లోనైయ్యారు. 
 
గతంలో తన కుమార్తె లగ్న పత్రిక రాసుకునే రోజునే తనను అరెస్ట్ చేసి మానసికంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేమో ఇలా ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరిపి దెబ్బతీయాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఢిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ (కేసీఆర్) ఇద్దరు కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారన్నారు. అయినప్పటికీ తాను భయపడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి అన్నారు.