మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (22:39 IST)

ఆయన పేరుకే ఎక్సైజ్ ఎస్.ఐ... ఆస్తులు 50 కోట్లు...

చిత్తూరు జిల్లాలో ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కర్నూరు జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఏకంగా 50 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులను కూడబెట్టారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు ఎలా సంపాదించారో అర్థంకాక ఎసిబినే ఆశ్చర్యపోతోంది.

చిత్తూరు లోని విజయ కుమార్ ఇంటితో పాటు కాట్పాడి, తిరుపతిలోని రాంనగర్ క్వార్ట్సర్స్, కర్నూలు జిల్లాలలో ఎసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు సమీపంలోని యాదమర్రిలో కోట్ల రూపాయల విలువ చేసే భూముల పత్రాలు, చిత్తూరులోని ఇంటిలో ఐదు వందల నోట్లు రెండు బండిళ్ళు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
అంతేకాకుండా కొన్ని వైన్ షాపులకు విజయ్ కుమార్ బినామీగా కూడా ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు సంపాదించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.