గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 16 జులై 2018 (17:48 IST)

ఆమె వయస్సు 45, అతని వయస్సు 18... ఇద్దరూ కలిసి?

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. నిద్రిస్తున్న భర్తను రోకలిబండతో తలపై మోది చంపేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. నిద్రిస్తున్న భర్తను రోకలిబండతో తలపై మోది చంపేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
సోమల మండలం ఆవులపల్లెలో గంగాధరం, కుమారిలు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నాడు. భర్త కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కుమారి వయస్సు 45 సంవత్సరాలు. భర్త గంగాధరం కూలి పని చేసి ఆ డబ్బు మొత్తం తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
భర్తతో పూర్తిగా విసిగిపోయిన కుమారి ఇంటి పక్కనే ఉన్న ఒక యువకుడితో పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. పిల్లలు ఇంట్లో ఉండగానే యువకుడితో కలిసేది కుమారి. ఈ విషయాన్ని తండ్రికి చెప్పారు ఇద్దరు పిల్లలు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గంగాధరం ఆమెపై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత పూటుగా తాగేసి నిద్రపోయాడు. 
 
గాఢ నిద్రలోకి జారుకున్న గంగాధరం తలపై రోకలి బండతో కొట్టి చంపేసింది కుమారి. ఆ తరువాత పిల్లలను వదిలి యువకుడితో పారిపోయింది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.