సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 18 జులై 2018 (21:15 IST)

తమిళనాడులో భారీ తిమింగలం... రూ. 163 కోట్లు, 100 కిలోల బంగారం...

దేశంలోనే భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు, బంగారం. ఆదాయపు పన్ను అధికారులు ఎస్పీకె అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 22 ప్రాంతాల్లో రూ. 163 కోట్లు పట్టుకున్నారు. ఇంకా 100 కిలోల బంగారం కూడా పట్టుబడటంతో ఐటీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇంత భారీ స్థాయిలో నగదు, బంగారం పట్టుబటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోటల్ ఆవరణలో పార్కింగ్ చేసి వున్న వాహనాల్లో నోట్ల కట్టలు, బస్తాల్లో డబ్బును చూసి అధికారులు అవాక్కయ్యారు. ఇదంతా అక్రమ, లెక్కల్లో చూపని ఆదాయంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
 
తమిళనాడులోని ఎస్‌పీకే అండ్ కంపెనీ రోడ్లు, జాతీయ రహదారులను నిర్మించే కంపెనీగా గుర్తింపు వుంది. ఈ కంపెనీ ఆదాయం పన్ను ఎగవేసినట్లు గుర్తించిన ఐటీ అధికారులు సోమవారం నుంచి సోదాలు చేపట్టారు. కాగా ఈయనకి రాజకీయ నాయకులతో సంబంధాలు వున్నట్లు తెలుస్తోంది. నగదు భారీగా వుండటంతో డబ్బు లెక్కించే యంత్రాలను తెచ్చి మరీ లెక్కిస్తున్నారు అధికారులు.