సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (18:06 IST)

స్వాజీతో గడపాలంటూ మహిళా శిష్యురాళ్లు గదిలో తోసి తలుపులేశారు...

లైంగికదాడి కేసులో మరో స్వామీజీ దాతీ మహరాజ్ ఇరుక్కున్నారు. ఓ మహిళా భక్తురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై అత్యాచార కేసు నమోదైంది. ఇద్దరు మహిళా శిష్యురాళ్లు తనను బలవంతంగా లాక్కెళ్లి గదిలోకి నెట్టి స్వామీ

లైంగికదాడి కేసులో మరో స్వామీజీ దాతీ మహరాజ్ ఇరుక్కున్నారు. ఓ మహిళా భక్తురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై అత్యాచార కేసు నమోదైంది. ఇద్దరు మహిళా శిష్యురాళ్లు తనను బలవంతంగా లాక్కెళ్లి గదిలోకి నెట్టి స్వామీజీతో గడపాలంటూ బలవంతం చేసి గది తలుపులు మూసివేశారనీ, దీంతో స్వామీజీ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆ మహిళ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఫలితంగా ఆయనపై కేసు నమోదు చేశారు.
 
దేశంలో ఉన్న వివాదాస్పద స్వాజీల్లో దాతీ మహరాజ్ ఒకరు. దాతీ మహరాజ్‌తో పాటు ఆయన శిష్యులపై 25 ఏళ్ల మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేశారు. పదేళ్లుగా దాతీ మహరాజ్‌ వద్ద తాను శిష్యరికం చేశానని, అయితే ఆయనతో పాటు ఇద్దరు శిష్యులు తనపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం తాను రాజస్థాన్‌లోని తన స్వస్థలానికి వెళ్లిపోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.
 
ఇద్దరు మహిళా శిష్యురాళ్లు స్వామీజీ గదిలోకి తనను బలవంతంగా తీసుకెళ్లారనీ, అపుడు తాను తిరస్కరించగా ఇతర శిష్యురాళ్లూ ఆయనతో గడిపారంటూ తనను గదిలోకి నెట్టి తలుపులు వేశారని ఫిర్యాదులో వెల్లడించారు. స్వామీజీని, ఆయన సోదరులను అరెస్ట్‌ చేసి, రెండు ఆశ్రమాలను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో బాధితురాలు కోర్టును కోరారు.