మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 12 జులై 2018 (14:21 IST)

మత గురువులు మృగాల్లా ప్రవర్తించారు.. : కేరళ హైకోర్టు

ఓ మహిళపై నలుగురు ఫాదర్లు అత్యాచారం జరిపిన ఘటనపై కేరళ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు ఫాదర్లు కాదనీ మృగాళ్లలా ప్రవర్తించారనీ, వాళ్ళను వదిలిపెట్టొద్దని ఆదేశించింది. దేశంలో సంచలనం సృష్టించిన కొట్టా

ఓ మహిళపై నలుగురు ఫాదర్లు అత్యాచారం జరిపిన ఘటనపై కేరళ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు ఫాదర్లు కాదనీ మృగాళ్లలా ప్రవర్తించారనీ, వాళ్ళను వదిలిపెట్టొద్దని ఆదేశించింది. దేశంలో సంచలనం సృష్టించిన కొట్టాయం మహిళ గ్యాంగ్‌రేప్‌ కేసుపై కేరళ హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులైన నలుగురు మత గురువులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని బుధవారం పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితుల్లో ఒకరు లొంగిపోగా.. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
కాగా, గత నెలలో 34 ఏళ్ల తన భార్యపై నలుగురు మత గురువులు సామూహిక అత్యాచారనికి పాల్పాడ్డారంటూ ఓ వ్యక్తి చర్చి మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఓ ఆడియో క్లిప్‌‌ను కూడా విడుదల చేశాడు. అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో దుమారం చెలరేగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత మహిళ నుంచి ఫిర్యాదు నమోదు చేశారు. 
 
ఈ ఫిర్యాదులో ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. '20 ఏళ్ల క్రితం సదరు చర్చి ఫాదర్‌ లోబర్చుకున్నాడని, వివాహం చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. ఆపై పాపపరిహారం కోసం ముగ్గురు మత గురువులను ఆశ్రయించగా.. వాళ్లు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి మరీ వాళ్లు కూడా తనపై అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
 
ఇదే అంశంపై హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'మత గురువులు మృగాల్లా ప్రవర్తించారు. ఓ మహిళపై 20 ఏళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నారంటే వారిని మనుషులు పరిగణించాల్సిన అవసరం లేదు' అని పేర్కొంది. అంతేకాదు వాళ్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను తోసిపుచ్చిన కోర్టు.. తక్షణమే నిందితులను అరెస్ట్‌ చేయాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది.