1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Kerala church priests suspended after romance for silence audio clip

కేరళలో దారుణం : వివాహితపై ఐదుగురు ఫాదర్ల అత్యాచారం...

కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రార్థన పేరుతో ఓ వివాహితపై ఐదుగురు ఫాస్టర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేరళ రాష్ట్రంలోని మలంకర ఆర్థొడాక్స్‌ చర్చికి చెందిన ఫాస్టర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు.

Kerala
కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రార్థన పేరుతో ఓ వివాహితపై ఐదుగురు ఫాస్టర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేరళ రాష్ట్రంలోని మలంకర ఆర్థొడాక్స్‌ చర్చికి చెందిన ఫాస్టర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తిరువళ్లకు చెందిన వివాహిత పెళ్లికి ముందు ఓ ఫాదర్‌తో సన్నిహిత సంబంధం ఉండేది. తన తప్పును ఆమె పెళ్లయిన తర్వాత పదే పదే తలచుకొని కుమిలిపోసాగింది. తన బాధను జీసస్ ఎదుట చెప్పుకొని సాంత్వన పొందేందుకు చర్చికొచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో ఫాదర్‌తో తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకుని కుమిలిపోసాగింది. ఆ మహిళ బలహీనతను ఆసరాగా చేసుకుని ఆ ఫాదర్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
ఆ తర్వాత ఆమెకు తెలియకుండా రహస్యంగా వీడియో తీసి.. ఆ వీడియోను మరో ఫాదర్‌కు.. అతను ఇంకొకరికి ఇలా మొత్తం ఐదుగురు ఫాదర్లకు షేర్ అయింది. వీరంతా కలిసి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగడుతూ వచ్చారు. 
 
ఈ పరిస్థితుల్లో గత ఫిబ్రవరిలో తన భార్య మెయిల్‌కు ఓ హోటల్‌కు సంబంధించిన భారీ బిల్లు రావడంతో అనుమానించిన భర్త గట్టిగా అడిగే సరికి బాధితురాలు జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐదుగురు ఫాదర్లను చర్చి నిర్వహణ కమిటీ సస్పెండ్‌ చేసింది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కొత్త భార్యతో ముద్దూముచ్చట తీర్చుకుని... ప్రియురాలితో భర్త జంప్