శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (18:18 IST)

కొత్తగా నిర్మిస్తున్న ఇల్లు.. 4 రోజులు.. 9 అడుగుల లోతు.. నరబలి.. ఎక్కడ?

నెల్లూరు జిల్లాలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. 15 రోజుల క్రితం కందుకూరు నుంచి ఓ అర్థరాత్రి ఓ వ్యక్తిని తీసుకొచ్చి పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే,

నెల్లూరు జిల్లాలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. 15 రోజుల క్రితం కందుకూరు నుంచి ఓ అర్థరాత్రి ఓ వ్యక్తిని తీసుకొచ్చి పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, కలిగిరి మండలం తూర్పుదూబగుంట ఎస్సీ కాలనీకి చెందిన చదలవాడ మాల్యాద్రి కుటుంబం అర్థరాత్రి పూట పూజలు చేసి నరబలి ఇచ్చినట్లు స్థానికులు ఫిర్యాదులో తెలిపారు.
 
కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో ఈ తాంత్రిక పూజలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు తొమ్మిది అడుగుల లోతు గుంత తీసి ఈ పూజలు జరిపారని.. మళ్లీ గుంతను పూడ్చినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో తెలిపారు. 
 
కానీ మాల్యాద్రి కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబపెద్దకి అనారోగ్యంగా వుండటం వల్ల కాటికాపరి సూచనల మేరకు ఇంట్లో తొమ్మిది అడుగుల లోతు తీసి పూజలు జరిపి దానిలో గుమ్మడికాయను పూడ్చి పెట్టామని చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మాల్యాద్రి ఇంట్లో పూడ్చిన తొమ్మిది అడుగుల గుంతను తవ్వి పరిశీలిస్తున్నారు.