'కాళ్లు కాలిపోతాయి తల్లీ' అంటూ తన కాలును ఆసరాగా ఇచ్చిన జగన్...
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగుతోంది. ఈ పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగుతోంది. ఈ పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా బీమసింగి సంక్షన్ నుంచి బలరామపురం మధ్యలో చంద్రంపేటకు చెందిన చలుమూరి ఏలేష్, రమణమ్మ దంపతులు, తమ పిల్లలతో కలసి జగన్ పాదయాత్రలో పాల్గొని నడిచారు. ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. పైగా, తారు రోడ్డు కావడంతో కాళ్లు కాలిపోతున్నాయి.
పైగా, ఈ పాదయాత్రలో స్వల్ప తొక్కిసలాట జరగింది. దీంతో రమణమ్మ కుమార్తె సంగీత ఒక చెప్పు ఎక్కడో జారిపోయింది. జగన్ వెంట నడవాలన్న లక్ష్యంతో పోయిన చెప్పు కోసం ఏమాత్రం పట్టించుకోకుండా, జగన్‌తో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది.
దీన్ని గమనించిన జగన్... 'కాళ్లు కాలిపోతాయి తల్లీ' అని వారించారు. అయినా సంగీత వినలేదు. ఎండకు ఇబ్బంది పడుతున్నావమ్మా అంటూ, తన సెక్యూరిటీకి, చెప్పు ఎక్కడ పడిందో వెతికి తేవాలంటూ పురమాయించారు.
పైగా, సెక్యూరిటీ సిబ్బంది ఆ చెప్పును తెచ్చేంతవరకు సంగీత కాలు కాలకుండా, తన పాదాన్ని ఆమె పాదానికి జగన్ ఆసరా ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది చెప్పును తెచ్చేంత వరకూ ఆ చిన్నారితో మాట్లాడుతూ ఉన్న జగన్, అంతసేపూ ఆమె కాలికిందనే తన కాలును ఉంచారు. ఆపై జగన్ వెంట సంగీత మరికొంత దూరం నడిచింది.