సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:56 IST)

వైఎస్ బయోపిక్ యాత్ర: జగన్ మోహన్ రెడ్డిగా విజయ్ దేవరకొండ

వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ముందు మరో సూపర్ ఆఫర్ వచ్చి కూర్చుందట. అదేంటయా అంటే... వైఎస్సార్ బయోపిక్ చిత్రం యాత్రలో జగన్ పాత్రకు ఈ యంగ్ హీరోను సంప్రదించినట్లు సమాచారం. కాగా ఇప్పటికే విజయ్ దేవరకొండ నోటా అనే రాజకీయ చిత్రంలో నటిస్తున్నాడు.

వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ముందు మరో సూపర్ ఆఫర్ వచ్చి కూర్చుందట. అదేంటయా అంటే... వైఎస్సార్ బయోపిక్ చిత్రం యాత్రలో జగన్ పాత్రకు ఈ యంగ్ హీరోను సంప్రదించినట్లు సమాచారం. కాగా ఇప్పటికే విజయ్ దేవరకొండ నోటా అనే రాజకీయ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. 
 
ఇంతకుముందు జగన్ పాత్రలో సూర్య నటిస్తారని అనుకున్నారు. ఆ తర్వాత కార్తీ అనుకున్నారు కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి ఈ ఆఫర్ విజయ్ దేవరకొండ ఓకే అంటాడో లేదో చూడాలి.
 
ఇదిలావుంటే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కోసం దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో హైప్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. బాహుబలి రానాను అచ్చం చంద్రబాబు నాయుడు మాదిరిగా అతడి ఫిజిక్కును మార్చేసి నిన్న వినాయకచవితి సందర్భంగా లుక్ కూడా విడుదల చేశాడు. యాత్ర చిత్రంలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌గా ఆయన తనయుడు, నట సింహం బాలయ్య నటిస్తున్నారు. మరి ఈ రెండు బయోపిక్ లలో ఏది బెస్ట్ అవుతుందో చూడాలి.