మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (13:58 IST)

మారుతీ రావుకు మద్దతుగా ర్యాలీ... కలిసేందుకు జైలు వద్ద క్యూ...

ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ జరిగింది. తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శాంతిర్యాలీ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ్యులు జైల్‌లో మా

ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ జరిగింది. తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శాంతిర్యాలీ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ్యులు జైల్‌లో మారుతీరావుని కలిసేందుకు ములాఖాత్‌ కోరగా అందుకు పోలీస్‌ అధికారులు నిరాకరించడంతో జైల్‌లో ఉన్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ను కలిసారు. 
 
మేజర్‌ అయినప్పటికీ ప్రేమ వివాహల్లో తల్లిదండ్రుల అంగీకారం ఉండేలా చట్ట సవరణ చేయాలని కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం సమర్పించారు. మిర్యాలగూడ సెంటర్లో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని భావి సమాజానికి చెడు సంకేతాలు వెళతాయని నిర్వాహకులు పోలీస్, రెవెన్యూ అధికారులకు విన్నవించారు.