మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : శనివారం, 15 సెప్టెంబరు 2018 (20:54 IST)

నా పరువు కంటే నా కూతురు ఎక్కువేం కాదు... ప్రణయ్‌ను చంపినందుకు బాధ లేదు... మారుతీరావు

ప్రణయ్‌ను హత్య చేయించింది తానేనని అమృత తండ్రి మారుతీరావు పోలీసుల ముందు అంగీకరించాడు. ప్రణయ్ హత్య కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో మారుతీ రావ్, శ్రవణ్, ఇద్దరు సుపారీ కిల్లర్లు వు

ప్రణయ్‌ను హత్య చేయించింది తానేనని అమృత తండ్రి మారుతీరావు పోలీసుల ముందు అంగీకరించాడు. ప్రణయ్ హత్య కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో మారుతీ రావ్, శ్రవణ్, ఇద్దరు సుపారీ కిల్లర్లు వున్నారు. ప్రణయ్‌ను చంపేందుకు రూ. 10 లక్షలు బేరం కుదుర్చుకున్నట్లు మారుతీరావు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

ఇందులో భాగంగా హత్య చేసేందుకు సుపారీ 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. రెండు నెలలుగా సుపారీ గ్యాంగ్ రెక్కీలు నిర్వహించారు. సుపారీ గ్యాంగ్ హైదరాబాద్ సరిహద్దులో ఉన్న జిల్లాకి చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. తన కూతురిపై వున్న ప్రేమతోనే ప్రణయ్‌ని చంపించాననీ, అతడిని చంపినందుకు తనకేమీ బాధలేదని చెప్పడం గమనార్హం. కాగా ప్రణయ్ తన కూతురుని 9వ తరగతి‌లో ప్రేమిస్తున్నట్లు తెలియడంతో వార్నింగ్ ఇచ్చానని వెల్లడించాడు.
 
తను ఎన్నిసార్లు వార్నింగులు ఇచ్చినా అతడు వినలేదనీ, తన కూతురును పెళ్లి చేసుకుని తన పరువు తీసాడని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. సొసైటీలో నా కూతురు కంటే నా పరువే ముఖ్యమని భావించాననీ, అందువల్లే సుపారీ గ్యాంగ్‌తో అతడిని చంపించినట్లు వెల్లడించాడు. ప్రణయ్‌ను చంపేటపుడు తన కుమార్తెకి ఎలాంటి హాని చేయవద్దని వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాడు.