శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (19:26 IST)

మిర్యాలగూడ పరువు హత్య... నిందితుల ఆచూకి చెప్పినవారికి పారితోషికం...

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక జ్యోతి ఆసుపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన ప్రణవ్ కేసులో పరారీలో ఉన్న ఏ-1 నిందితుడు తిరునగరు మారుతీ రావు, ఏ-2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆచూకి తెలిసిన

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక జ్యోతి ఆసుపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన ప్రణవ్ కేసులో పరారీలో ఉన్న ఏ-1 నిందితుడు తిరునగరు మారుతీ రావు, ఏ-2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆచూకి తెలిసిన వారు నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్, సెల్ : 94407 95600/ డి.ఎస్.పి. మిర్యాలగూడ శ్రీనివాస్, సెల్ : 94407 95636 నెంబర్లకు సమాచారం ఇవ్వలసిందిగా జిల్లా ఎస్పీ రంగనాధ్ కోరారు. 
 
ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం పోలీస్ శాఖ తరపున అందచేస్తామని ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని చెప్పారు. మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఈ పరువు హత్యకు సంబంధించి నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. నిందితుల ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు.