గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:47 IST)

ఆఫీసు నిర్మాణాలు ఎలా చేయాలో తెలుసా..?

ఈ కాలంలో ఆఫీసులు తెగ కట్టేస్తుంటారు. చాలామందైతే వాస్తుప్రకారం కాకుండా అలానే ఆఫీసు నిర్మాణాలు చేస్తుంటారు. అలా నిర్మాణాలు చేయడం మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతోంది. కనుక వీలైనంత వరకు ఈ వాస్తుపరంగా ఆఫీసు నిర్మించుకుంటే లాభాలు చేకూరుతాయని విశ్వాసం.
 
ఆఫీసు ముఖ్య విభాగాలు.. అంటే డైరక్టర్స్, చైర్మన్స్, మేనేజర్స్ గదులను దక్షిణ నైరుతి నుండి ప్రారంభించి తూర్పు, ఉత్తరం వరకు వచ్చేలా.. అంటే ఎల్ ఆకారంగా కట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఖాళీ ఉండేలా చేయాలి. ఆ స్థలంలో దక్షిణ భాగంలో ఉత్తరమున కూర్చొనే విధంగా కొలతలో చాంబర్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ గది నైరుతిలో అంటే ఉత్తర ముఖంగా బీరువాను అమర్చుకోవచ్చు.
 
గల్లా పెట్టెను కుడివైపు పెట్టుకుని ఆ చాంబర్‌కు ద్వారం ఉత్తర ఈశాన్యం వచ్చేలా చేయాలి. ముఖ్యంగా ఈ చాంబర్ నైరుతి గది కన్నా ఎక్కువగా ఉండాలి. అలాకాకుంటే దానికి సమానంగా కూడా ఉండొచ్చు.