1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Why Jhanvi kapoor rejected act with Vijay Devarakonda?

విజయ్ దేవరకొండ ముద్దులు చూసి దణ్ణం పెట్టిన హీరోయిన్...

Jhanvi kapoor
విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే అయినా సౌత్ ఇండియాలో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గీత గోవిందం సినిమా విజయ్ పేరును ఒక రేంజ్‌లో తీసుకెళ్ళింది. అలాంటి హీరోతో నటించడానికి చాలామంది పోటీ పడుతున్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం విజయ్ దేవరకొండ పేరు చెబితే దణ్ణం పెట్టేస్తుంది. 
 
ఆ హీరోయిన్ ఎవరో కాదు దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి. బాలీవుడ్‌లో ఒక సినిమా ఆఫర్ వచ్చింది విజయ్ దేవరకొండకు. హీరోయిన్‌గా జాహ్నవిని తీసుకోవాలనుకున్నారు. అయితే విజయ్ పేరు చెప్పగానే జాహ్నవి నేను అస్సలు నటించనని చెప్పేసిందట. అందుకు కారణం దర్శకుడు కరణ్‌ జోహార్ అని తెలుస్తోంది. ప్రస్తుతం కరణ్‌ జోహార్ దర్శకత్వం వహిస్తున్న రెండు సినిమాల్లో నటిస్తోందట జాహ్నవి. అందుకే బిజీబిజీగా ఉంటోందట. దీంతో ప్రస్తుతం సినిమాలను ఒప్పుకోనని చెబుతోందట. 
 
అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దులతో ముంచెత్తిన అర్జున్ రెడ్డి సినిమాను జాహ్నవి చూసిందట. అందుకే ఆ హీరోతో నటించనని తెగేసి చెప్పేస్తోందట. విజయ్ దేవరకొండతో సినిమా చేయనని జాహ్నవి చెప్పడంతో తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారుతోంది.
About Writer
జె
తర్వాతి కథనం
దీపికా - రణవీర్ పెళ్లయింది... ఇట్ ఈజ్ అఫీషియల్(ఫోటోలు)