గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (15:22 IST)

''A'' సైట్లను బ్యాన్ చేసినట్లే.. పైరసీని ప్రచారం చేసే..?: విజయ్ దేవరకొండ

గీత గోవిందం సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకు చెందిన సన్నివేశాలు లీక్ అయ్యాయి. గీత గోవిందం సినిమాను పైరసీ భూతం వెంటాడింది. అయినా గీత గోవిందం మంచి సక్సెస్ అందుకుని విజయ్ ఖాతాలో హిట్‌గా నిలిచింది. అంతేగాకుండా.. తొలిసారి రూ.1000కోట్ల గ్రాస్‌ను అందుకున్నాడు. 
 
గీత గోవిందం తర్వాత నోటా సినిమాతో సక్సెస్ ట్రాక్‌ను చేజార్చుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా ఎలాగైనా ట్యాక్సీవాలా సినిమాతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు పైరసీ ఎఫెక్ట్ కొంత ఆందోళన కలిగిస్తున్న అంశమన్నాడు. పైరసీకి ప్రచారం కలిగిస్తున్న వెబ్ సైట్లను కూడా బ్యాన్ చేయాలని కౌంటరిచ్చాడు. 
 
కొన్ని అడల్డ్ వెబ్ సైట్లపై ప్రభుత్వం ఎలాగైతే నిషేధం విధించిందో అలాగే పైరసీకి ప్రచారం చేసే వెబ్ సైట్లను కూడా బ్యాన్ చేయాలని.. అప్పుడే సినిమా ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని తెలిపాడు. టాక్సీ వాలా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాడు.