సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (17:45 IST)

అర్జున్ రెడ్డి నటించిన తొలి మ్యూజిక్ వీడియో.. నీ వెనకాలే నడిచి.. (Video)

టాలీవుడ్ క్రేజ్ హీరో విజయ్ దేవరకొండ.. తాజాగా టాక్సీవాలాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో.. ప్రస్తుతం విజయ్ నటించిన తొలి మ్యూజిక్ వీడియో ''నీ వెనకాలే నడిచి'' అనే పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. విజయ్ దేవరకొండ, మలోబికాలపై చిత్రీకరించిన ఈ పాట రొమాంటిక్ మెలోడీ సాంగ్‌తో యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో వుంది. 
 
ఇప్పటికే ఈ పాటను ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు. ఓ ప్రేమకథను పాట రూపంలో అందంగా తెరకెక్కించారు. ఇక అనంత్ శ్రీరాం లిరిక్స్, సింగర్ చిన్మయి వాయిస్‌తో పాట అదిరింది. నీ వెనకాలే నడిచి అంటూ సాగే ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి..