శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (18:14 IST)

చెర్రీ సరసన బాలీవుడ్ భామ.. ఎన్టీఆర్ సరసన.. హాలీవుడ్ ముద్దుగుమ్మ

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ సరసన అలియా భట్ నటించనుందని టాక్ వస్తోంది. ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇక ఎన్టీఆర్ సరసనైతే.. హాలీవుడ్ నటి కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. 
 
కథ ప్రకారం హాలీవుడ్‌ భామ అయితేనే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నారు. అలాగే రెండో షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఈ చిత్రంలో బాహుబలి స్టార్‌ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో పాటు ప్రభాస్‌ను కూడా ఒకే ఫ్రేమ్‌లోచూపించేందుకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నట్టుగా ఫిలిమ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.