శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (09:21 IST)

రాజమౌళి "ట్రిపుల్ ఆర్‌"లో మరో ఆర్ వచ్చి చేరింది... ఎవరతను?

దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ కొత్త చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. కానీ, ఆర్ఆర్ఆర్ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూడు (రాజమౌళి, రామరావు, రామ్ చరణ్) ఆర్‌లకు సరసన ఇపుడు మరో ఆర్ కూడా చేరింది. ఆయన ఎవరో కాదు.. ప్రభాస్ రాజు. 
 
బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే త‌న ప్ర‌తి చిత్రాన్ని జ‌నాల‌లోకి సులువుగా తీసుకెళ్ళే రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి కూడా వినూత్న ప్రచారం చేసుకుంటున్నాడు. 
 
భారీ తార‌గ‌ణంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఈ చిత్రంలో భాగం కానున్నట్టు తెలుస్తోంది. ఓ కీల‌క పాత్ర‌లో న‌టించమ‌ని రాజ‌మౌళి, ప్ర‌భాస్‌ని కోర‌గా ఆయ‌న వెంట‌నే ఓకే అనేశాడ‌ట‌. దీంతో ఒకే తెర‌పై ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు క‌నిపించ‌నున్నార‌ని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. 
 
కాగా, ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్‌, ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు రాగా, ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని .. చరణ్‌కు బాబాయ్‌గా నటించనున్నాడని అన్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తన సొంత బ్యానర్ డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. కీరవాణి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.