సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (16:07 IST)

'బాహుబలి' రియల్ లైఫ్‌లో విలన్లను చూసి వుండడు... ఎవరు?

రాయదుర్గంలో హీరో ప్రభాస్ కట్టించుకున్న గెస్ట్ హౌస్ స్థలం మీద వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రభుత్వం స్థలంలో గెస్ట్ హౌస్ కట్టాడని కొన్నిరోజుల క్రితం రెవిన్యూ అధికారులు గెస్ట్ హౌస్‌ను సీజ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభాస్ పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
రీల్ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి.. రియల్ లైఫ్‌లో విలన్లతో తలపడి ఉండడని వ్యాఖ్యానించింది. గతంలో ఆ స్థలాన్ని ప్రభాస్ తండ్రి కొనుగోలు చేశారని దానిని క్రమబద్దీకరణ కూడా చేసుకున్నామని ప్రభాస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ప్రభాస్ భూ కబ్జాదారుడని ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యతరం చెప్పింది. 
 
ప్రభాస్‌కు అనుకూలంగా తీర్పునిస్తే కబ్జాదారులను హక్కుదారులుగా చేసినట్టు అవుతుందని ప్రభుత్వ లాయర్ వాదించడంతో ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.